ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి గల్లంతు | NIT student missing in dharma sagar reservoir | Sakshi
Sakshi News home page

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి గల్లంతు

Jan 26 2016 1:34 PM | Updated on Nov 9 2018 4:31 PM

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి గల్లంతు - Sakshi

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి గల్లంతు

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మంగళవారం ఓ విద్యార్థి గల్లంతయ్యాడు.

ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మంగళవారం ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. వరంగల్ నిట్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులు రిజర్వాయర్ లో దిగారు.  ఖమ్మం జిల్లాకు చెందిన సామినేని నిఖిల్ (22) ప్రమాదవశాత్తూ జారీపడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement