అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి | MP ponguleti Srinivasa Reddy Visitation | Sakshi
Sakshi News home page

అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి

Jul 17 2015 1:36 AM | Updated on Aug 9 2018 4:45 PM

గురువారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషనుపరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి - Sakshi

గురువారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషనుపరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి

అవేర్‌గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్: అవేర్‌గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదని ఆమెకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉండి చేయూత నంది స్తుందన్నారు.

గతంలో ఆమె గర్ల్స్ స్టేట్ హోంలో ఆశ్రయం పొందిందని అక్కడ కూడా సరైన వసతులు లేవన్న సంగతి బాధితురాలి ఆవేదన ఆధారంగా తనకు తెలిసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా  స్పం దించి తగిన వసతులు కల్పించాలని కోరా రు.  ప్రత్యూషకు ఉచిత వైద్య సేవలందిం చిన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అండగా నిలబడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కు ల సంఘం అధ్యక్షురాలు అనూరాధలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement