'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి' | minister palle raghunatha reddy visit GGH guntur | Sakshi
Sakshi News home page

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి'

Jan 23 2016 1:33 PM | Updated on Sep 3 2017 4:10 PM

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి'

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి'

సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు అందరూ సర్కారు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

గుంటూరు మెడికల్: సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు అందరూ సర్కారు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా ఆస్పత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పల్లె, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పరామర్శించారు. అనంతరం మంత్రి ఓపీలో బీపీ, ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకే మంత్రి కామినేని ఇక్కడ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారని, తాను పరీక్షలు చేయించుకున్నానని వివరించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా మంత్రి కామినేని మోకాలి ఆపరేషన్ వివాదంగా మారుతోంది. జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే ఇక్కడ ఆపరేషన్ అన్న ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement