'ఉస్మానియా'ను రాత్రికిరాత్రే కూల్చలేరు కదా | High Court adjourned to next week a petition on OGH relocation | Sakshi
Sakshi News home page

'ఉస్మానియా'ను రాత్రికిరాత్రే కూల్చలేరు కదా

Aug 4 2015 11:51 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 'ఉస్మానియా ఆస్పత్రిని రాత్రికి రాత్రే కూల్చలేరు కదా' అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ పిటిషనర్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఉస్మానియా కూల్చివేతపై జీవో కాపీలు దాఖలు చేయాలని పిటిషనర్ కు తెలిపింది. ఆస్సత్రి కూల్చివేతపై తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement