నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం | four died after auto overturns in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం

Dec 23 2015 7:53 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది చేపల కొనుగోలుకు ఆటోలో నెల్లూరుకు వెళుతున్నారు. కడివేడు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు చల్లా రమణమ్మ (40), పల్లి పాపమ్మ (34), వలిపి రాజమ్మ (45) మృతి చెందారు. తమ్మిశెట్టి రమణమ్మ, పూసా చెల్లెమ్మ, చల్లా సుజాత, సన్నాసయ్య, బెల్లంకొండ రమణయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నెల్లూరుకు తరలించారు. వీరిలో రమణమ్మ, చెల్లెమ్మల పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement