కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన డీజీపీ | DGP JV Ramudu visits swarna Bar | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన డీజీపీ

Dec 8 2015 1:03 PM | Updated on Sep 3 2017 1:42 PM

కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు.

విజయవాడ : కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ను జెవి రాముడు పరిశీలించారు.

 

అంతకుముందు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రాముడు చెప్పారు. కృష్ణలంక కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement