పవన్‌ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ | BJP spokesperson krishna sagar Rao talks against pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ

Apr 24 2017 1:13 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ - Sakshi

పవన్‌ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ

పవన్‌ కల్యాణ్‌ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నట్లు కనబడుతోంది.

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నట్లు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు ఎద్దేవా చేశారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడానికి రాజకీయాలంటే సినిమా కాదని ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దేశం మొత్తాన్ని టీం ఇండియాలా నడిపిస్తున్న ప్రధాని పనితీరుపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

సమగ్ర జాతీయత అనేది బీజేపీ ప్రాథమిక సిద్ధాంతమని, అంతే తప్ప ఉత్తర, దక్షిణ లాంటి విభేదాలేమీ లేవని చెప్పారు. పవన్‌ తన సినిమాల్లో మాదిరిగా ట్విట్టర్‌లో చిత్ర విచిత్రంగా పోస్టింగ్స్‌ పెడుతున్నారని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ అన్న ప్రజారాజ్యం పెట్టి మంచి ధరకు దాన్ని అమ్మేశారని.. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించేటప్పుడు దానికి ఆధారాలు ఉండాలని, ఇలాంటి ట్విట్టర్‌ కామెంట్లు రాజకీయ నిరుద్యోగతనానికి నిదర్శనమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement