ప్రత్తికోళ్లలంకలో 144 సెక్షన్ | 144 Section in | Sakshi
Sakshi News home page

ప్రత్తికోళ్లలంకలో 144 సెక్షన్

Jan 23 2016 8:27 AM | Updated on Sep 3 2017 4:10 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో పాతకక్షలు భగ్గుమన్న నేపథ్యంలో పోలీసుల గస్తీని మరింత పెంచారు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో పాతకక్షలు భగ్గుమన్న నేపథ్యంలో పోలీసుల గస్తీని మరింత పెంచారు. గ్రామం అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని 53 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతికోళ్లలంకలో చేపల చెరువుల వివాదంలో శుక్రవారం ఇరు వర్గాలు మధ్య వివాదం చోటు చేసుకుంది.

ఆ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మరణించగా... మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని... పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా 53 మందిపై కేసు నమోదు చేశారు. క్షతగాత్రులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement