పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి | 10 years old girl dies in freak accident | Sakshi
Sakshi News home page

పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి

Dec 26 2015 6:01 PM | Updated on Sep 3 2017 2:37 PM

పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(10) రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. మధుకాన్ కన్స్ట్రక్షన్  కంపెనీ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement