నకిలీ సర్టిఫికెట్లపై ఎమ్మార్వో వివరణ | kidney rocket..mro explanation | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌..నకిలీ సర్టిఫికెట్లపై ఎమ్మార్వో వివరణ

Published Thu, Jan 4 2018 1:06 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా : కిడ్నీ మార్పిడి కోసం వెంకటేశ్వర నాయక్‌ను వేదాంత ఆసుపత్రి యాజమాన్యం రిఫర్ చేసిందని నరసరావుపేట ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి తెలిపారు. గుంటూరు, నరసరావుపేటల్లో కిడ్నీ రాకెట్‌ వెలుగులోకి రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత కపిలవాయి విజయకుమార్ తనకు ఫోన్ చేశారని, వెంటేశ్వర నాయక్‌ తమ వాడే త్వరగా సర్టిఫికెట్ ఇవ్వమని తనతో చెప్పినట్లు వెల్లడించారు.

వెంకటశ్వరనాయక్‌ సర్టిఫికేట్లు పోలీసు వెరిఫికేషన్‌లో నకిలీవని తేలిందని, వెంకటేశ్వర నాయక్‌ని పిలిచి విచారించామని చెప్పారు. కిడ్నీ ఇస్తే తనకున్న అప్పులు తీర్చేస్తామని చెప్పినందుకే తాను కిడ్నీ ఇస్తున్నానని వెంకటేశ్వర నాయక్‌ చెప్పారని వివరించారు. తన పైన కేసు పెడతామని చెప్పటంతో నాయక్‌ పారిపోయాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement