వారఫలాలు (17 నవంబర్‌ నుంచి 23 వరకు)

Weekly Horoscope Of November 17th To 23rd In Sakshi Funday

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు శీఘ్రగతిన పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురై పరీక్షగా మారవచ్చు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థుల శ్రమ వృథా కాగలదు. ఆత్మీయుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పట్టిన పట్టువీడకుండా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు.  భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. ఒక కోర్టు వ్యవహారం కూడా సానుకూలమవుతుంది. ఒక కాంట్రాక్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి ద్వారా అందిన సమాచారం మీలో మరింత ఉత్తేజాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. మీలో దాగిన ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. భూలాభాలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరిగే సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనయోగం. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు లభించే అవకాశం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వీరికి  అన్ని విధాలా అనుకూలమైన కాలం. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి.  ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా గడ్డుస్థితి నుంచి బయటపడతారు.  వ్యతిరేకులు కూడా మీపై ప్రశంసలు కురిస్తారు. వ్యాపారాలు ఆశించినదాని కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిబం«ధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. గతంలో చేజారిన డాక్యుమెంట్లు, నగలు తిరిగి లభ్యమయ్యే అవకాశం. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, దృఢదీక్షతో అధిగమిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలం.  ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మెరుగుపడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
గతంలో అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. సమాజసేవలో భాగస్వామువులతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు సంభవం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన వ్యవహారాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు.  ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి అప్రయత్న కార్యసిద్ధి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్తగా తీసుకున్న నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి.  వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top