వారఫలాలు(మార్చి 15 నుంచి 21 వరకు) | Weekly Horoscope From March 15th To 21st In Sakshi Funday | Sakshi
Sakshi News home page

వారఫలాలు(మార్చి 15 నుంచి 21 వరకు)

Mar 15 2020 7:48 AM | Updated on Mar 15 2020 7:48 AM

Weekly Horoscope From March 15th To 21st In Sakshi Funday

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ప్రారంభంలో కొన్ని వివాదాలు నెలకొన్నా çస్వశక్తితో పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో నూతనోత్సాహం. విద్యార్థులు  అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చాకచక్యంగా  సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. చేజారిన సొమ్ము తిరిగి దక్కించుకుంటారు. కుటుంబంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. కళారంగం వారికి అనుకోని  సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శుభకార్యాలపై  కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ఆస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. సోదరులు,సోదరీలతో విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. విద్యార్థులకు కొంత అనుకూలత. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం చివరిలో బంధువిరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  దుర్గాస్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. ధార్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. 

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పట్టుదలతో ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు.  విద్యార్థులకు  పోటీపరీక్షల్లో విజయం వరిస్తుంది. కొత్త సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. కుటుంబ సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.  రాజకీయవర్గాలకు కొత్త పదవీయోగం.  వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులతో  పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.  కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు.  ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని సన్మానాలు. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. 

తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనుల్లో కొన్ని  ఆటంకాలు. బంధువిరోధాలతో అశాంతికి లోనవుతారు. కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. నిర్ణయాలు కొన్ని వాయిదా వేసుకుంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. రుణయత్నాలు తప్పవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. అనుకున్న ఆశయాలు కుటుంబసభ్యుల చేయూతతో  సాధిస్తారు. సన్నిహితులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. భూవివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక  ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. కుటుంబసభ్యులు మరింత ఆదరణ చూపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఇతరుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా  మారతారు. కుటుంబసభ్యుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో  వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కార్యజయం. మిత్రుల నుంచి శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి.. కుటుంబసభ్యులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  కళారంగం వారికి అనుకోని అవకాశాలు.  వారం చివరిలో  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.

కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆకస్మిక ధనలాభం, రుణబాధల నుంచి విముక్తి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది, లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు  విదేశీ పర్యటనలు. వారం మధ్యలో సోదరులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు  సహాయసహకారాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని సమస్యలు తీరే అవకాశం. చిరకాల ప్రత్యర్థులతో కొన్ని విషయాలలో రాజీ కుదుర్చుకుంటారు. కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు.  ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. కోర్టు వివాదం నుంచి బయటపడతారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో  ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో  ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement