వారఫలాలు (15 డిసెంబర్‌ నుంచి 21 వరకు)

Weekly Horoscope Of December 15Th To December 21th 2019 In Sakshi Funday

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి తగినంత  డబ్బు సమకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా మీకు విధేయులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. స్వల్ప అనారోగ్యం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. బాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళ పరిస్థితి. రుణయత్నాలు. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఒక ఆహ్వానం కొంత ఊరటనిస్తుంది. విద్యార్థులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. గృహం కొనుగోలు, నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. పుణ్యక్షేత్రాల సందర్శనం. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మీ మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరంగా పదవులు దక్కుతాయి. వారం మధ్యలో  ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే క్రమేపీ అనుకూల పరిస్థితులు ఉంటాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. రావలసిన బకాయి సొమ్ము అంది అవసరాలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులను సైతం ఆదరిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. బంధువులతో తగాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. రుణాలు సైతం తీరుస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు ఊహించని పోస్టులు దక్కుతాయి. సన్నిహితులు కొంత సహాయపడి మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top