వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

Weekly Horoscope From 21st July To 27 July 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించకుఉంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్నదానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కుటుంబంలో మరింత ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చీటికీమాటికీ వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. వారం చివరిలో బంధువిరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మొదట్లో కొంత గందరగోళంగానే గడుస్తుంది. ఏపనిపైనా ఏకాగ్రత ఉండదు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయతే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో ఇంటర్వ్యూలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. బంధువులు,మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. మీ శ్రమ వృథా కాదు, కొద్దిగా ఆలస్యమైనా ఫలితం దక్కుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దిపాటి రుణబాధలు సైతం తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణాలలో అవరో«ధాలు తొలగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరిగి ఆశ్చర్యపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే సమయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బంది ఎదురై రుణాల వేటలో పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని నిర్ణయాలు పునఃసమీక్షిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనకు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది.  కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బద్ధవిరోధులు సైతం మీ మాటకు కట్టుబడడం విశేషం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాల అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వివాహాది వేడుకల నిర్వహణపై కుటుంబంలో చర్చిస్తారు. విద్యావకాశాలు  పెరిగి విద్యార్ధులకు ఊరటకలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top