స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల

Published Sat, Oct 1 2016 11:32 PM

స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల - Sakshi

నిత్య జనసందోహంతో కూడిన తిరుమల క్షేత్రంలో టీటీడీ కార్పొరేట్ స్థాయిలో పరిశుభ్రత అమలు చేస్తోంది. టీటీడీతోపాటు ఔట్ సోర్సింగ్ సంస్థలతో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే ఏర్పాట్లు చేసింది. కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్‌కి తిరుమల ఎంపిక కావడంతో ప్రభుత్వరంగ సంస్థలు కోలిండియా, ఓఎన్‌జీసీ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేస్తున్నాయి. తిరుమలలో చేపట్టాల్సిన పలురకాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.26 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసింది  మురుగు నీటి శుద్ధి ద్వారా సమకూరిన 5 ఎంఎల్‌డీ నీటిని తిరిగి ఉద్యానవనాలు, శ్రీగంధం మొక్కలు, ఘాట్‌రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకానికి వాడుతున్నారు.

ఇందుకోసం రూ.6 కోట్లు, ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.1.5 కోట్లు, ప్రస్తుత విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చేందుకు రూ.5.5 కోట్లు ఖర్చవుతోంది  కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ కార్ల వినియోగానికి రూ.6 కోట్లు ఖర్చవుతుంది  భక్తులకు పరిశుద్ధ తాగునీటిని అందించడానికిగానూ మరో 20 ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చవుతోంది. ఈ పనులు పూర్తి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement
Advertisement