రాశి ఫలాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 6వరకు | rom November 30 to December 6, the benefits of mass | Sakshi
Sakshi News home page

రాశి ఫలాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 6వరకు

Nov 30 2014 4:52 AM | Updated on Sep 2 2017 5:21 PM

బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం  మధ్యలో వివాదాలు. తీర్థయాత్రలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోహణి, మృగశిర 1,2పా.)
 యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతల సమర్థవంత నిర్వహణకు ప్రశంసలు పొందుతారు.  జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు  మందగిస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి. ఇరుగు పొరుగుతో సఖ్యత. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు.  ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు ఫలితాలు  సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం  వాహనయోగం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల సర్దుబాటు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు. ఇంటాబయటా అనుకూలం.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులు, బంధువులతో వివాదాలు తీరతాయి. సేవలకు తగిన గుర్తింపు.  సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వ్యయప్రయాసలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాల పరిష్కారం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు  సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి  సన్మానాలు. వారం మధ్యలో  ఆరోగ్యభంగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 బంధువులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)

 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు  చికాకు పరుస్తాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో స్వల్ప ధనలాభం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు  విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)

 బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.  వాహనయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement