breaking news
Important decisions
-
టీచర్ల విధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
హలో.. నేను పోలీసుని..
సాక్షి, హైదరాబాద్: గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసే నూతన విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభించిన నగర పోలీసు విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియపరిచే కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా.. ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసుల్ని విచారిస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అత్యధిక శాతం కేసుల్లో ఎస్ఐ స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు ఐవోలుగా వ్యవహరిస్తుంటారు. ఎస్ఐలు, ఇతర ఐవోలకు దర్యాప్తు బాధ్యతలతోపాటు పరిపాలన, బందోబస్తు, భద్రతా విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం చాలాఅరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది. దీంతో పోలీసు విభాగంపై ఇవి ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తు ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. కేసుగా మారని పిటిషన్ల విషయంలోనూ ఈ పద్ధతినే అవలంభించనున్నారు. ఆన్లైన్లో అన్నీ ఉండవు.. ఈ–కాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్లైన్ విధానాలను పోలీసు విభాగం ప్రవేశపెట్టింది. ‘నో యువర్ కేస్ స్టేటస్’కు అవకాశం కల్పించింది. దీని ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతి, చార్జ్‌షీట్ దాఖలై కోర్టు విచారణలో ఉందనో, కేసును మూసేశామనో మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే మాత్రం ఆన్లైన్ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల కేసు వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండట్లేదు. తొలి రోజు 9 కేసులు.. గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించే పద్ధతి ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు నగర వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. గస్తీ వాహనాల సిబ్బందిపై నమ్మకం ఉంచిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఠాణా అధికారులకే బాధ్యతలు.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ అంజనీకుమార్ కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి ఐవో తన దగ్గర ఉన్న కేసుల జాబితాతోపాటు ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతిరోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా ఫోన్లు చేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సదరు కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి పోలీసు తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతోపాటు వారి నంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని కొత్వాల్ నిర్ణయించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని జోనల్ డీసీపీలు, ఏసీపీలకు అప్పగించనున్నారు. అయితే ఫోన్ చేసే బాధ్యతల్ని దర్యాప్తు అధికారికా.. లేక రిసెప్షనిస్టులకు అప్పగించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
రాశి ఫలాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 6వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో వివాదాలు. తీర్థయాత్రలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోహణి, మృగశిర 1,2పా.) యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతల సమర్థవంత నిర్వహణకు ప్రశంసలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి. ఇరుగు పొరుగుతో సఖ్యత. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం వాహనయోగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల సర్దుబాటు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులు, బంధువులతో వివాదాలు తీరతాయి. సేవలకు తగిన గుర్తింపు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాల పరిష్కారం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.