ఆంగ్‌సాన్ సూచీ అనగానే రాజకీయాలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు మాత్రమే గుర్తుకు వచ్చే వారికి... రెబెకా ఫ్రాన్ రాసిన ‘ది అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ ఆఫ్ ఆంగ్ సాన్ సూచీ’ వ్యాసం చదివితే, ఆమెలోని మరో కోణం, ఆమె ప్రేమ లోతు తెలుస్తాయి.
ఆమెది తూర్పు. అతడిది పశ్చిమం. అయినా ఇద్దరిదీ ఒకే ప్రపంచమయ్యింది. ఎందుకంటే... ఎక్కడైనా నిబంధనలు వర్తిసాయి గానీ, ప్రేమలో మాత్రం వర్తించవు. ప్రేమలో ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలు పుట్టి కొత్త బంధాలను పరిచయం చేస్తాయి. ప్రేమ గట్టిదైతే తూర్పూపడమరలు సైతం ఇలాగే ఏకమవుతాయి!
జీవితం అంటే... రోజూ పాలిటిక్స్, ఫిలాసఫీ, ఎకనమిక్స్ క్లాసులు బుద్ధిగా వినడమే అన్నట్లుండేది, ఆక్స్‌ఫర్‌డ యూనివర్శిటీలో చదువుతోన్న సూచీకి. అలాంటి సమయంలో తన గార్డియన్ లార్డ్ గోర్ ద్వారా ఇంగ్లండ్ కుర్రాడు మైఖేల్ ఓరీస్ ఆమెకు పరిచయమయ్యాడు.
‘మనం బతకడానికి ఆహారం మాత్రమే సరిపోదు... హాస్యం కూడా అవసరం’ అని తన డైరీలో ఒకసారి రాసుకుంది సూచీ. దురదృష్టమేమిటంటే నవ్వే పరిస్థితి గానీ, ఇతరులను నవ్వించే అవకాశం గానీ అంతవరకూ ఆమెకు రాలేదు.
కానీ మైఖేల్ వచ్చాకే అవన్నీ జరిగాయి. అతడి రూపంలో నవ్వు ఆమెకు దగ్గరైంది. అతడి హాస్యంతో పొట్ట చెక్క లయ్యేలా నవ్వేది సూచీ. అంతకు ముందె ప్పుడూ ఒంటరిగా కనిపించే ఆమె... మైఖేల్‌తో కనిపించసాగింది. ఎప్పుడూ మౌనంగా ఉండేది... నవ్వుల వెన్నెల్లో విహరించసాగింది. అంతగా ఆమె జీవితాన్ని మార్చింది మైఖేల్ రాక.
ఒకరోజు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పార్క్‌లో... ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను’’ అని ప్రపోజ్ చేశాడు మైఖేల్. ఆమె నుంచి ఎలాంటి స్పందనా లేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది.
‘‘తప్పుగా మాట్లాడితే క్షమించు’’ అన్నాడు మైఖేల్. కొద్దిసేపటి తరువాత మౌనం వీడింది సూచీ. ‘‘నేను నా దేశం కోసం బతుకుతున్నాను. అక్కడి నుంచి ఏ క్షణం పిలుపు వచ్చినా రెక్కలు కట్టుకొని వెళతాను.
నీకు సమ్మతమేనా?’’ అంది. ‘‘ఏదైనా చేసే స్వేచ్ఛ నీకుంది. నువ్వు నాతో ఉన్నా, లేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పుడూ ఉంటావు’’ అన్నాడు మైఖేల్. ఆ మాటలు సూచీకి నచ్చాయి. అక్కడికక్కడే గ్రీన్‌సిగ్నలిచ్చింది. మైఖేల్‌కి భార్య అయ్యింది. పెళ్లి చేసుకుని ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సాధారణ గృహిణిలాగే వంట చేయడం నుంచి ఇల్లు శుభ్రం చేయడం వరకు అన్నీ చేయ సాగింది. పిల్లలు (అలెగ్జాండర్, కిమ్) ఆమె పంచప్రాణాలు. ‘గృహమే కదా స్వర్గసీమ’ అనుకునేంత ఆనందం!
అంతలోనే తల్లి ఆరోగ్యం బాలేదని మయన్మార్ నుంచి సూచీకి ఫోన్ కాల్. ‘‘అక్కడి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్లడం మంచిది కాదేమో’’ అన్నారు సన్నిహితులు. భయానికి ఆమె ఎప్పుడు భయపడింది గనుక! వెంటనే బయలుదేరింది. తల్లిని చూడ్డానికి హాస్పి టల్‌కి వెళ్లింది. అక్కడ మిలిటరీ పాలకుల రాక్షసత్వానికి బలైన బాధితులను, శవాలుగా పడి ఉన్న విద్యార్థులను చూసి కదిలిపోయింది. మహా నాయకుడు ఆంగ్‌సాన్ కుమార్తె సూచీ వచ్చిందని తెలిసి ఎక్కడెక్కడి నుంచో జనాలు రావడంతో రంగూన్ హాస్పిటల్ కాస్తా జనసముద్రం అయింది!
‘‘అమ్మా!... ఇక్కడి పరిస్థితులను చూస్తున్నావు కదా... నీ నాయకత్వం ఈ దేశానికి అవసరం’’ అన్నారు సూచీని కలిసిన విద్యావేత్తలు. వెంటనే సరే అంది. అంతవరకూ సాధారణ గృహిణిగా ఉన్న ఆమె, ప్రజాస్వామిక ఉద్యమంలో బలమైన నాయకురాలిగా మారింది.
ఇవన్నీ చూసి భయపడిపోయాడు మైఖేల్. తండ్రిని చంపినట్టే ఆమెనూ చంపేస్తారేమోననే దిగులు పట్టుకుంది అతడికి. అయినా భార్యకు అడ్డు చెప్ప లేదు. చెప్పడు కూడా. ఎందుకంటే, ఆమె ఆలోచనలను గౌరవిస్తాడు. ఆమె లక్ష్యాలకు అనుగుణంగా తాను జీవిస్తాడు. అంతగా తనను ప్రేమిస్తున్నాడు.
అందుకే తన భయాన్ని తనలోనే అణచుకుని ఆమెకు తోడుగా నిలిచాడు. అయితే తర్వాత సూచీ హౌజ్ అరెస్ట్ కావడంతో ఒంటరివాడయ్యాడు. ఆమె జ్ఞాపకాల సుడిలో కొట్టుమిట్టాడాడు. ఆ జ్ఞాపకాలతో జీవిస్తూనే మరణించాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలతో సూచీ జీవిస్తున్నారు. లక్ష్యం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ఆమె, ఆమె కోసం తన సంతోషాన్ని వదులుకున్న ఆయన... ఇంతకన్నా గొప్ప ప్రేమ ఉంటుందా!
- యాకూబ్ పాషా
తూర్పు పడమర!
Published Sat, Nov 7 2015 10:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement