మోటార్‌బైక్ మహా క్రేజ్! | Celebrities have craze on motorbikes | Sakshi
Sakshi News home page

మోటార్‌బైక్ మహా క్రేజ్!

Jul 13 2014 1:11 AM | Updated on Sep 2 2017 10:12 AM

మోటార్‌బైక్  మహా క్రేజ్!

మోటార్‌బైక్ మహా క్రేజ్!

ఈ స్పీడు యుగంలో బాగా క్రేజ్ ఉన్న వాటిల్లో మోటార్‌బైక్‌లు కూడా ముఖ్యమైనవి. అబ్బాయిలకు వాటిని నడపడం క్రేజ్ అయితే, అమ్మాయిలకు వారి వెనుక దర్జాగా కూర్చోవడం క్రేజ్!

ఈ స్పీడు యుగంలో బాగా క్రేజ్ ఉన్న వాటిల్లో మోటార్‌బైక్‌లు కూడా ముఖ్యమైనవి. అబ్బాయిలకు వాటిని నడపడం క్రేజ్ అయితే, అమ్మాయిలకు వారి వెనుక దర్జాగా కూర్చోవడం క్రేజ్!  సెలబ్రిటీల పాలిట కూడా బైక్‌లు సెలబ్రిటీలే! తమ బైక్‌లను అపురూపంగా చూసుకునే కొందరు సెలబ్రిటీలు వీరు.  
 
మహేంద్రసింగ్‌ధోనీ
మ్యాచ్ ముగిశాక టీమ్‌లో ఎవరో ఒకరికి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా వచ్చే బైక్‌నైనా సరే ధోనీ ఒక రైడ్ కొట్టకుండా వదిలపెట్టడు. తన సహచరులను ఎక్కించుకొని స్టేడియంలోనే షికారుచేసే ధోనీ రాంచీలో ఖాళీగా ఉన్నాడంటే ఆ సమయాన్ని తన యమహా ఆర్‌డీ350పై రైడింగ్‌తోనే గడిపేస్తాడు.  
 
సంజయ్‌దత్
ప్రస్తుతానికి సంజూబాబా జైల్లో ఉన్నాడు. దీంతో ఇంటి దగ్గర ‘హార్లే డేవిడ్ సన్ ఫ్యాట్ బాయ్’ను పలకరించే వాళ్లు లేకుండా పోయారట. ఈ 1584 సీసీ బైక్‌కు భూమిపై లక్షల సంఖ్యలో ప్రేమికులు ఉన్నారు. సంజయ్‌దత్ కూడా ఎంతో మోజుతో దీన్ని కొనుక్కొన్నాడు. అతడు జైలు నుంచి బయటకు వచ్చే వరకూ ఈ బైక్‌తో విరహమే మరి!
 
జాన్‌అబ్రహాం
చూడటానికి హీమ్యాన్‌లా కనిపించే జాన్ అబ్రహాం శాకాహారి. అయితే బైక్‌ల విషయంలో జాన్ చాలా దూకుడుగా ఉంటాడు. చిరుతపులులను తలపించే బైక్‌లను ఎంచుకొంటూ ఉంటాడు. ప్రస్తుతం జాన్ మనసు యమహా వీ-మ్యాక్స్‌పై కేంద్రీకృతం అయ్యింది. ఇది 1700 సీసీ బైక్ అంటే ఆశ్చర్యపోని బైక్ ప్రేమికుడు ఉండడేమో!
 
 సైఫ్ అలీఖాన్
 ఈ నవాబ్‌కు హార్లేడేవిడ్ సన్ అంటే ఎంతో మోజు. ఆ కంపెనీ నుంచి వచ్చే అధునాతన మోడల్స్‌లో దేన్నీ వదలకుండా కొనేస్తూ, అవకాశం దొరికితే ఒంటరిగా ముంబై వీధులను చుట్టేస్తూ ఉంటాడు!
 
 సల్మాన్‌ఖాన్
బాలీవుడ్ ఎంపరర్ ఖాన్‌కు కూడా భారీ సైజు బైకులంటే ఎంతో ఆసక్తి. సల్లూ తనకు ఎంతో ఇష్టమైన సుజుకీ ఇంట్రూడర్ బైక్‌ను దగ్గరుండి సర్వీసింగ్ చేయిస్తాడట. ఈ భారీ బైక్‌ను అమితంగా ప్రేమించే సల్మాన్ దానిపై షికారు చేసేది తక్కువే కానీ, దాని క్లీనింగ్‌కు విషయంలో మాత్రం చాలా శ్రద్ధ వహిస్తాడు. సల్లూ సుజుకీ ఇంట్రూడర్ 1800 సీసీబైక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement