ఫన్ డే.. పుస్తక సమీక్షణం | Book review of the week | Sakshi
Sakshi News home page

ఫన్ డే.. పుస్తక సమీక్షణం

Dec 1 2013 4:43 AM | Updated on Sep 2 2017 1:08 AM

ఫన్ డే.. పుస్తక సమీక్షణం

ఫన్ డే.. పుస్తక సమీక్షణం

‘విమర్శకుడైన వాడు కవి అయితే ఒక ప్రయోజనం...’ అన్నారు అద్దెపల్లి రామ్మోనరావు. ఆ ప్రయోజనం ఏమిటో ఈ పుస్తకం చదివిన వారికి సులభంగా అర్థమవుతుంది.

అక్షరాలా ఆకట్టుకునే వ్యాసాలు
  పేజీలు: 162
 ధర: 150
 ప్రతులకు: జి. సుబ్బారావు,
 16-131, గరల్స్ హైస్కూల్, పాతస్టేట్‌బ్యాంకు కాలనీ వద్ద, కొత్తపేట-
 533223, తూ.గో.జిల్లా.
 పుస్తకం    :    ఆక్షరావిష్కరణం (సమీక్ష-విమర్శ)
 రచన    :    గిడ్డి సుబ్బారావు

 
 ‘విమర్శకుడైన వాడు కవి అయితే  ఒక ప్రయోజనం...’ అన్నారు అద్దెపల్లి రామ్మోనరావు. ఆ ప్రయోజనం ఏమిటో ఈ పుస్తకం చదివిన వారికి సులభంగా అర్థమవుతుంది. కవిత్వం రాసి మెప్పించి అదే చేతితో విమర్శ రాసి ‘అయ్యో!’ అనిపించిన వారు ఉన్నారు. ప్రపంచ సాహిత్యాన్ని కాచి వడపోసి  ఉద్దండ విమర్శకులుగా ప్రసిద్ధి చెందిన వారు...కవిత్వమో, మరో ఇతర సృజన ప్రక్రియ జోలికో వెళ్లి పూర్తిగా విఫలమైనవారు ఉన్నారు. విమర్శను, సృజనను ఏకకాలంలో సమన్వయం చేసి మెప్పు పొందిన రచయితలు అరుదుగా ఉంటారు.  ఆ కోవకు చెందిన రచయిత గిడ్డి సుబ్బారావు.
 
 పుస్తకాలను చదివే క్రమంలో పాఠకుడిగా తాను అనుభవించిన అనుభూతులను, ఆ పుస్తకాలతో పరిచయం లేని పాఠకులకు సైతం చదివిన అనుభవాన్ని, అనుభూతులను సొంతం చేయడంలో సుబ్బారావు సఫలం అయ్యారు. శిఖామణిలాంటి సుపరిచిత కవుల పరిచయంతో పాటు ఎప్పుడు, ఎక్కడా వినని కవుల కవిత్వ విశ్లేషణ కూడా ఇందులో ఉంది. సుపరిచితులు, అపరిచితులు అనే తేడా లేకుండా ఒకే రకమైన శ్రద్ధ, ఆసక్తులతో సాహిత్య విమర్శ చేశారు. సాహిత్యంలో వివిధ ధోరణులను సాధికారికంగా విశ్లేషించారు. కవిత్వ ప్రేమికులను ఆకట్టుకునే పుస్తకం ఇది.
 - బి.రేవతి
 
 కొత్త పుస్తకాలు
 చాణక్య నీతి మాలికలు
 అనుసృజన: యల్లాప్రగడ ప్రభాకరరావు
 పేజీలు: 128; వెల: 120
 ప్రతులకు: పంగులూరి హనుమంతరావు,16-11-511.జి/7, శాలివాహననగర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36.
 ఫోన్: 040-24141560
 
 సత్యశోధన (బాల- ఉత్తరకాండలు అవాల్మీకీయములు)
 రచన: యర్రగుంట సుబ్బారావు; పేజీలు: 116; వెల: 60
 ప్రతులకు: వై.సుబ్బారావు, ఐ.ఎల్.టి.డి. కాలనీ, 4-109, చీరాల, ప్రకాశం జిల్లా-523157.
 
 ఆయుర్వేదంతో ఆరోగ్యంగా ఉండండి
 (మూలసూత్రాలు- ఆరోగ్య నియమాలు)
 రచన: డా.ఎస్.రాంరెడ్డి; పేజీలు: 498; వెల: 360
 ప్రతులకు: అమృతం హెల్త్‌కేర్ సిరీస్, 13-9-6, లలితా నగర్, కోణార్క్ థియేటర్ దగ్గర, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-60.
 ఫోన్: 040-24062243

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement