అదాశర్మ... అప్పుడే టీవీకా?! | Adah Sharma Turns Television serials | Sakshi
Sakshi News home page

అదాశర్మ... అప్పుడే టీవీకా?!

Aug 24 2014 1:30 AM | Updated on Sep 2 2017 12:20 PM

అదాశర్మ... అప్పుడే టీవీకా?!

అదాశర్మ... అప్పుడే టీవీకా?!

అందచందాలు మెండుగా ఉన్నా అందరూ సినిమాల్లో రాణించలేరని అదాశర్మని చూస్తే అర్థమవుతుంది. ‘1920’ చిత్రంలో దెయ్యం పట్టిన పిల్లగా నటించి అదరగొట్టిన అదా...

అందచందాలు మెండుగా ఉన్నా అందరూ సినిమాల్లో రాణించలేరని అదాశర్మని చూస్తే అర్థమవుతుంది. ‘1920’ చిత్రంలో దెయ్యం పట్టిన పిల్లగా నటించి అదరగొట్టిన అదా...  ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. తెలుగులో నితిన్ సరసన ‘హార్ట్ అటాక్’లోనూ నటించింది. కానీ కలసి రాలేదు. దాంతో బుల్లితెరకు బయలుదేరిందని తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా తీయబోతోన్న సీరియల్‌లో అదా ప్రధాన పాత్రలో నటించబోతోందట. దాంతో అదా అప్పుడే సీరియల్స్‌కి వెళ్లడమేంటని కొందరు అంటున్నారు. ఏం చేస్తుంది పాపం! చాన్సుల కోసం చూసి చూసి విసిగిపోయి ఉంటుంది. అయినా బుల్లితెరకి రావడం ఆమెకు బాధాకరమేమో కానీ, అంత చక్కని అమ్మాయి సీరియల్స్‌లో కనిపించడమంటే టెలివిజన్ ప్రేక్షకులకు సంతోషకరమైన విషయమే!

Advertisement
 
Advertisement
Advertisement