కలిపిన వాలంటైన్! | Valentine impregnated! | Sakshi
Sakshi News home page

కలిపిన వాలంటైన్!

Feb 19 2015 4:23 AM | Updated on Sep 2 2017 9:32 PM

కలిపిన వాలంటైన్!

కలిపిన వాలంటైన్!

పాప్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న లేడీ గాగ... బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాన్స్ పండించడంలోనూ అంతే ఫేమస్!

పాప్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న లేడీ గాగ... బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాన్స్ పండించడంలోనూ అంతే ఫేమస్! అయితే ఇన్నాళ్లూ డేటింగ్‌లకే పరిమితమైన ఈ సెక్సీ ర్యాపర్... నటుడు టేలర్ కిన్నెతో టైఅప్ అయింది. అదే... ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫింగర్లకు రింగులు మార్చుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ‘వాలంటైన్స్‌డేన అతడు తన హృదయాన్ని ఇస్తానన్నాడు. నేనూ అంగీకరించా’ అంటూ ఫొటోతో పాటు కామెంట్స్‌నూ షేర్ చేసిందీ సింగర్. వీకెండ్‌లో న్యూయార్క్‌లోని గాగ రెస్టారెంట్ జోయెన్ ట్రటోరియాలో ఓ అద్భుతమైన రొమాంటిక్ డిన్నర్‌ను ఆస్వాదించారు ఈ న్యూ కపుల్. విషయమేమంటే... ‘చికాగో ఫైర్’ యాక్టర్ టేలర్... లేడీకి ప్రపోజ్ చేసింది ఇక్కడే. అదే స్పాట్‌లో మెమరబుల్ పార్టీని కూడా వెంటనే ప్లాన్ చేసేసుకుని ఆ క్షణాలను అపురూపంగా మార్చేసుకున్నారు ఇద్దరూ! ఇక అసలుసిసలు రొమాన్స్ షురూ అవుతుందంటూ సంకేతాలు పంపించారు. సో... బెస్టాఫ్ లక్ టు దెయిర్ న్యూ లైఫ్!   
 

Advertisement
 
Advertisement
Advertisement