సోనాక్షి డ్రీమ్! | Sonakshi's Dream! | Sakshi
Sakshi News home page

సోనాక్షి డ్రీమ్!

Jan 5 2015 12:36 AM | Updated on Apr 3 2019 6:23 PM

సోనాక్షి డ్రీమ్! - Sakshi

సోనాక్షి డ్రీమ్!

పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నా... బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హాకు తీరని కల ఒకటుందట.

పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నా... బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హాకు తీరని కల ఒకటుందట. రీసెంట్‌గా ఆ కల నెరవేరిందని ఈ సొగసరే చెప్పుకుంది. బిగ్‌స్క్రీన్‌పై సల్మాన్‌తో అరంగేట్రం కంటే పెద్ద డ్రీమేముంటుంది హీరోయిన్ కావాలనుకుంటున్న ఏ భామకైనా! కానీ... సోనాక్షి అసలు కోరిక మాత్రం తాజాగా కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పేజీపై వచ్చిన తన ఫొటోతో తీరిందట. ‘ఆ మ్యాగజైన్‌కు థ్యాంక్స్. అది కేవలం ఫొటోనే అయినప్పటికీ... కనీసం అలాగన్నా నా డ్రీమ్ నెరవేరింది’ అంటూ సదరు క్లిక్‌ను పోస్ట్ చేసింది సోనాక్షి. ఈ ఫొటోలో ఈ వయ్యారి రాక్‌స్టార్‌లా డ్రమ్స్ వాయిస్తుంటుంది. ఇంతకీ అమ్మడి అసలు కల... రాక్‌స్టార్ కావాలనా? టాప్ డ్రమ్మర్ అవ్వాలనా!

Advertisement
 
Advertisement
Advertisement