షార్ట్ రూట్ టు సక్సెస్ | Short Route to Success | Sakshi
Sakshi News home page

షార్ట్ రూట్ టు సక్సెస్

Sep 8 2014 1:49 AM | Updated on Oct 2 2018 2:44 PM

షార్ట్ రూట్ టు సక్సెస్ - Sakshi

షార్ట్ రూట్ టు సక్సెస్

సినిమా తీయూలంటే క్వాలిఫికేషన్‌తో పనిలేదు. గాడ్‌ఫాదర్ అండదండలు అక్కర్లేదు. సినీ కుటుంబ వారసత్వంతో పని లేదు. మీలో ప్యాషన్ ఉంటే మేం ప్లాట్‌ఫాం కల్పిస్తావుంటోంది సినీషార్ట్స్.

సినిమా తీయూలంటే క్వాలిఫికేషన్‌తో పనిలేదు. గాడ్‌ఫాదర్ అండదండలు అక్కర్లేదు. సినీ కుటుంబ వారసత్వంతో పని లేదు. మీలో ప్యాషన్ ఉంటే మేం ప్లాట్‌ఫాం కల్పిస్తావుంటోంది సినీషార్ట్స్. ఈ తరం ప్రతిభను వెలికితీయుడానికి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తోంది. బాలీవుడ్ సినీ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ, మేరీకోమ్ చిత్ర దర్శకుడు ఉమంగ్ కుమార్ తదితరులతో కూడిన జ్యూరీ ఉత్త చిత్రాలను ఎంపిక చేస్తుంది. పోటీలో గెలుపొందిన మొదటి ఐదు చిత్రాలకు బహువుతి అందించడంతో పాటు, వీటిని ఓ జాతీయు చానల్‌లో ప్రసారం చేయునున్నారు.

మొదటి స్థానంలో నిలిచిన చిత్రానికి రూ.లక్ష, తర్వాతి స్థానాల్లో నిలిచిన చిత్రాలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇవ్వనున్నారు. ‘అగెనైస్ట్ ఆల్ ఆడ్స్’ థీమ్‌తో హిందీలో 5 నిమిషాల చిత్రాన్ని రూపొందించి సినీషార్‌‌ట్స వెబ్‌సైట్ (http://www.cineshorts.in) లో సబ్మిట్ చేయూల్సి ఉంటుంది. వయాకామ్ 8 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిలిం పోటీకి ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్.

ముంబై 48 అవర్ ఫిలిం ప్రాజెక్ట్
48 గంటల్లో షార్ట్ ఫిలిం తీసే సత్తా మీకు ఉంటే ఈ పోటీ మీ కోసమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పోటీ అక్టోబర్ 10వ తే దీ నుంచి 12 వరకు ముంబై లో జరగనుంది. ఈ పోటీలో ఉత్తగా నిలిచిన చిత్రాలను అంతర్జాతీయు పోటీలకు ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొంటున్న ప్రతి టీమ్‌కు జానర్‌తో పాటు ఒక డైలాగ్, ఒక ప్రాపర్టీ, ఒక క్యారెక్టర్‌ను అసైన్ చేస్తారు. వీటితో చక్కటి సినిమాను 48 గంటల్లో పూర్తి చేయూల్సి ఉంటుంది. ఈ పోటీలకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు రూ.2,500గా నిర్ధారించారు. ఇతర వివరాలకు లాగ్ ఇన్ టు.. www.48hourfilm.com/en/mumbai

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement