అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ... | Memarabul! | Sakshi
Sakshi News home page

అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ...

Feb 7 2015 12:13 AM | Updated on Sep 2 2017 8:54 PM

అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ...

అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ...

నేడు బాలీవుడ్ స్టార్ అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అదేదో సినిమాలో హీరో ‘కంచుకట్ల వారి పట్ల’తో భామలను తన వెంట తిప్పుకుంటాడు. శాండల్‌వుడ్ భామ సంజన వరస చూస్తుంటే అలానే ఉంది. హీరోలను బుట్టలో వేసుకొనే కిటుకులు అమ్మడికి బాగా తెలిసినట్టున్నాయి. నిన్న గాక మొన్న హీరో తమిళ హీరో శింబును అతని పుట్టిన రోజు సందర్భంగా ‘ట్వీట్స్’తో ఆకాశానికెత్తేసిన సంజన... నేడు బాలీవుడ్ స్టార్ అనిల్‌కపూర్‌తో ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇది చూసిన అభిమానులే కాదు... ఇండస్ట్రీ పీపుల్ కూడా కాస్తంత ఆశ్చర్యపోయారు. అసలు అనిల్‌ను ఎందుకు కలిసిందన్నది చెప్పలేదు గానీ... ‘లెజండ్ అనిల్ కపూర్‌తో కప్పు కాఫీ... కాసిన్ని కబుర్లు పంచుకున్న అద్భుతమైన మార్నింగ్’ అంటూ ట్వీటిందీ చిన్నది!
 

Advertisement
 
Advertisement
Advertisement