
మణిరత్నం
మౌనరాగం పలికించగల దర్శకరత్నం మణిరత్నం తన సినిమాని తానే రీమేక్ చేయబోతున్నారు.
మౌనరాగం పలికించగల దర్శకరత్నం మణిరత్నం తన సినిమాని తానే రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ మళయాల నటుడు మమ్ముటీ కుమారుడు దుల్ఖర్ సల్మాన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో మౌనరాగం మళ్లీ రూపుదిద్దుకుంటున్నట్లు మాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా సంబంధించి మణిరత్నం అధికారికంగా ఇప్పటి వరకు చిన్న మాట కూడా మాట్లాడలేదు. అయినా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. ఇందులో హీరోగా దుల్ఖర్ సల్మాన్ నటించనున్నారనేది మాత్రం ఖరారైంది. హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్య మీనన్, శృతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయి.
నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన 'ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరి కెమీస్ట్రీ సూపర్బ్.బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన 'హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 6న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పీసీ శ్రీరామ్ పని చేయనున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పని చేయన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి అఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్.
**