ఆశలపై నీళ్లు! | Hopes the water! | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు!

Feb 16 2015 12:29 AM | Updated on Sep 2 2017 9:23 PM

ఆశలపై నీళ్లు!

ఆశలపై నీళ్లు!

అభిమానుల ఆశలపై కూల్‌గా నీళ్లు చల్లింది కాజోల్. షారూఖ్‌ఖాన్‌తో ఈ అమ్మడు కలసి రోహిత్ శెట్టి సినిమాలో చేస్తుందన్న వార్తలను రూమర్లుగా కొట్టేసింది.

అభిమానుల ఆశలపై కూల్‌గా నీళ్లు చల్లింది కాజోల్. షారూఖ్‌ఖాన్‌తో ఈ అమ్మడు కలసి రోహిత్ శెట్టి సినిమాలో చేస్తుందన్న వార్తలను రూమర్లుగా కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ సూపర్ హిట్ పెయిర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి ఉత్సాహాన్ని నీరుగార్చింది. ‘ఈ సినిమా గురించి నాకేమీ తెలియదు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు కూడా లేవు’ అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది కాజోల్. ఇదిలావుంటే... కాజోల్, షారుఖ్‌లతో పాటు వరుణ్‌ధావన్, కృతి సానన్ కూడా నటిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదంటూ  ఇంకా ఆశలు వదులుకోని  అభిమానులూ ఉన్నారు!

Advertisement
 
Advertisement
Advertisement