సమాధానాలు


మన దేశం గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ..



1. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు.



2. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.



3. మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.



4. మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.



5. ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.



6. బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది.



7. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో  టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.  



8. మన జాతీయ క్రీడ.. హాకీ కాదు. అసలు మనకు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు.



courtesy: Dr. Goparaju Narayana Rao

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top