ఈ వారం హిట్స్ | Youtube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం youtube హిట్స్

Feb 3 2016 10:46 PM | Updated on Oct 17 2018 4:36 PM

ఈ వారం హిట్స్ - Sakshi

ఈ వారం హిట్స్

న్యూయార్క్ ఈమధ్య మంచు తుపానులో కూరుకుపోయింది.

స్నోబోర్డింగ్ విత్ ది ఎన్.వై.పి.డి.
 నిడివి : 2 ని. 41 సె.
 హిట్స్ : 1,24,36,041

న్యూయార్క్ ఈమధ్య మంచు తుపానులో కూరుకుపోయింది. రోడ్లు, వాహనాలు ఎక్కడివక్కడ బిగదీసుకుపోయాయి. అయితే ఈ పరిస్థితిని ఎంజాయ్ చేసినవాళ్లూ ఉన్నారు! టైమ్‌స్క్వేర్ నుంచి న్యూయార్క్ నగరంలోని తక్కిన ప్రధాన కూడళ్లకు.. రోడ్డు మీద పేరుకుని పోయిన ఐస్‌లో.. స్నోబోర్డింగ్ చేశారు. ఐస్‌ను తొలగించే పనుల్లో ఉన్న న్యూయార్క్ పోలీసులు కూడా ఎంజాయ్ చేస్తూ తమ పని కానిచ్చేశారు.
 
జేన్-పిల్లోటాక్ : వీడియో సాంగ్
నిడివి : 3 ని. 26 సె.
హిట్స్ : 3,74,90,669

 
ఇంగ్లండ్ గాయకుడు జేన్ మాలిక్ త్వరలో విడుదల చేయబోతున్న తన తొలి సోలో స్టూడియో ఆల్బమ్ ‘మైండ్ ఆఫ్ మైన్’లోని ఒక పాట పిల్లోటాక్. మార్ధవ స్వరంతో, డౌన్‌బీట్‌లో జేన్ పాడిన ఈ ప్రణయగీతం యువతీయువకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రేమానుబంధం గాలిలో తేలిపోయే దశకు చేరుకున్నప్పుడు హృదయాలు బరువెక్కి ఎంతగా మెత్తబడతాయో ఈ సాంగ్‌లో 23 ఏళ్ల జేన్ లయబద్ధంగా అభినయిస్తూ ఆలపించారు.
 
కోల్డ్‌ప్లే : హెమ్న్ ఫర్ ది వీకెండ్    
నిడివి : 4 ని. 20 సె.
హిట్స్ : 2,14,48,968

 
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ విడుదల చేసిన వీడియో సాంగ్ ‘హెమ్న్ ఫర్ ది వీకెండ్’. అమెరికన్  గాయని బేయన్స్, భారతీయ నటి సోనమ్ కపూర్ ఇందులో కనిపిస్తారు. చిత్రీకరణ గత అక్టోబర్‌లో ముంబైలో జరిగింది. దాంతో ఈ వీడియో ఆధునిక, సంప్రదాయ సంగీతాల సమ్మేళనంలా కనిపిస్తుంది. వినిపిస్తుంది. దేహం, మనసు ఐక్యం చెందే భావనను అనుభూతి చెందాలంటే ఈ వీడియోను తప్పని సరిగా చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement