మేరీ సులూ | vidya balan in 'Tumhari Sulu' movie | Sakshi
Sakshi News home page

మేరీ సులూ

Dec 11 2017 12:02 AM | Updated on Dec 11 2017 12:02 AM

vidya balan in 'Tumhari Sulu' movie - Sakshi

‘తుమ్హారీ సులూ’ అని ఒక సినిమా వచ్చింది. సూపర్‌ డూపర్‌ స్మార్ట్‌ మూవీ. బొద్దుగా ఉన్న విద్యాబాలన్‌ స్టార్‌డమ్‌కి బరువు భారం కాదని, అగ్గిపుల్లలా తయారవ్వక్కర్లేదని, వంకర్లు తిరగడం కంటే ఎక్స్‌ప్రెషన్‌ స్ట్రాంగ్‌ ఉంటే స్క్రీన్‌ని చితకబాదొచ్చని, టికెట్లు చిరగ్గొట్టొచ్చని, చప్పట్ల కేరింతలు డీటీఎస్‌ కంటే లౌడ్‌గా ఉంటాయని, మళ్లీ మళ్లీ మళ్లీ ప్రూవ్‌ చేస్తూనే ఉంది.

సినిమా పేరు తుహ్మారీ సులూ అయితే ‘మేరీ సులూ’ అని ఎందుకు రాశారూ అని అనుకుంటున్నారా? సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌... అబ్బ ఇదేం ట్విస్టూ? పేరెందుకలా రాశారంటే ఇంకో కొత్త పేరు తెచ్చేరేంటి? ఎవరీ సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌! ఎవరంటే విద్యాబాలన్‌ ప్రియ మొగుడు. తుమ్హారీ సులూ ఇప్పటికే నాలుగుసార్లు చూశాడట. ఇంట్లో చూసే విద్య కంటే స్క్రీన్‌ మీద కనబడిన బాలనే బాగా నచ్చిందట! విద్యాబాలన్‌ని విషయం అడిగితే ‘స్క్రీన్‌ మీద ఇంకా పెద్దగా కనబడతాను కదా’ అని గట్టిగా నవ్విందట.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement