రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50 | Videocon Rs .5999 in inphiniyam Z 50 | Sakshi
Sakshi News home page

రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50

Dec 23 2014 11:55 PM | Updated on Nov 6 2018 5:26 PM

రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50 - Sakshi

రూ.5999లకే వీడియోకాన్ ఇన్ఫీనియం జెడ్50

లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ పవర్‌లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ పవర్‌లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫీనియం జెడ్50 నోవాను దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీడియోకాన్ ఇటీవల విడుదల చేసింది. అయిదు అంగుళాల స్క్రీన్ కలిగిఉన్న ఈ ఫోన్ ధర రూ.5,999లు మాత్రమే. మైక్రోప్రాసెసర్ సామర్థ్యం 1.3 గిగాహెర్ట్జ్ కాగా, ర్యామ్ ఒక జీబీగా ఉంది. అంతేకాదు.. ఎనిమిది జీబీలు ఉన్న మెమరీని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు.

రెండు సిమ్‌లను సపోర్ట్ చేసే ఇన్ఫీనియం జెడ్ 50 నోవాలో 8, 2 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్లున్న కెమెరాలు ఉపయోగించారు. ఆంటీవైరస్, జీపీఎస్ ఆధారిత వ్యక్తిగత భద్రత అప్లికేషన్ వీసెక్యూర్‌లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా హంగామా, గేమ్‌లాఫ్ట్ వంటి సైట్లకు 90 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. బ్లూటూత్ 4.0, వైఫై, మిరాకాస్ట్ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌పై శ్రద్ధ ఉన్నవారికి మెరుగైన అవకాశమనే చెప్పాలి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement