ఎగ్ బిర్యానీ... వెరీ గుడ్డు టేస్టు | Very Tasty egg Egg Biryani | Sakshi
Sakshi News home page

ఎగ్ బిర్యానీ... వెరీ గుడ్డు టేస్టు

Sep 16 2014 11:38 PM | Updated on Jul 11 2019 5:40 PM

ఎగ్ బిర్యానీ... వెరీ గుడ్డు టేస్టు - Sakshi

ఎగ్ బిర్యానీ... వెరీ గుడ్డు టేస్టు

మొదట నాలుగు గుడ్లను ఉడికించి, పెంకు తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లి, పచ్చి మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు అందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి.

కావలసినవి:

బాస్మతి బియ్యం    -    2 కప్పులు (10 నిమిషాలు నానబెట్టాలి)
గుడ్లు                 -    6
ఉల్లిగడ్డ               -      ఒకటి (తరగాలి)
పచ్చి మిర్చి         -    10
లవంగాలు          -    4
ఉప్పు                -    తగినంత
అల్లం వెల్లుల్లి  పేస్ట్      -    తగినంత
మసాలా    -    టేబుల్ స్పూన్

 
తయారీ విధానం: మొదట నాలుగు గుడ్లను ఉడికించి, పెంకు తీసి పక్కన పెట్టుకోండి.  ఒక గిన్నెలో నూనె వేడి చేసి  ఉల్లి, పచ్చి మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు అందులో వేసి లైట్  బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. రెండు గుడ్లను కొట్టి దీనిలో వేసి కలపండి.ఆ తరువాత బాస్మతి బియ్యాన్ని వేసి నిమిషం పాటు కలపండి. తగినంత ఉప్పు వేసి ఉడికించండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు,  మసాల వేసి కలపండి. కొంచెం నిమ్మరసం జత చేయండి... వేడి వేడి బిర్యానీ తయార్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement