breaking news
Table spoon
-
ఎగ్ బిర్యానీ... వెరీ గుడ్డు టేస్టు
కావలసినవి: బాస్మతి బియ్యం - 2 కప్పులు (10 నిమిషాలు నానబెట్టాలి) గుడ్లు - 6 ఉల్లిగడ్డ - ఒకటి (తరగాలి) పచ్చి మిర్చి - 10 లవంగాలు - 4 ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత మసాలా - టేబుల్ స్పూన్ తయారీ విధానం: మొదట నాలుగు గుడ్లను ఉడికించి, పెంకు తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లి, పచ్చి మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు అందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. రెండు గుడ్లను కొట్టి దీనిలో వేసి కలపండి.ఆ తరువాత బాస్మతి బియ్యాన్ని వేసి నిమిషం పాటు కలపండి. తగినంత ఉప్పు వేసి ఉడికించండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు, మసాల వేసి కలపండి. కొంచెం నిమ్మరసం జత చేయండి... వేడి వేడి బిర్యానీ తయార్! -
పెళ్లాం ఊరెళితే...
టిమాటిమ్ సెల్తా సలాడ్ పట్టే సమయం: పది నిమిషాలు కావలసినవి: తాజా టమోటాలు తరిగినవి దోసకాయలు తరిగినవి పచ్చి మిర్చి తరిగినవి లెమన్ జ్యూస్ 4 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పెప్పర్ పౌడర్ టేబుల్ స్పూన్లో నాలుగో వంతు ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు తయారీ: చాలా సింపుల్... ఆలివ్ ఆయిల్‌ను మినహాయించి అన్ని పదార్థాలనూ కలపండి. ఆ తరువాత ఆలివ్ ఆయిల్‌ను చిలకరించి... ఫ్రెండ్స్‌కు సర్వ్ చేయండి.