దేశ దేశానికో రుచి... | Travel Tips | Sakshi
Sakshi News home page

దేశ దేశానికో రుచి...

May 14 2015 11:23 PM | Updated on Sep 3 2017 2:02 AM

దేశ దేశానికో రుచి...

దేశ దేశానికో రుచి...

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లాలని ఆశపడుతూ ఉంటారు.

ట్రావెల్
 
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లాలని ఆశపడుతూ ఉంటారు. అయితే వెళ్లేముందు ఆ దేశం గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆహారం గురించి. ఎందుకంటే కొత్త ప్రదేశాల్లో ఎక్కువ ఇబ్బంది పడేది ఆహారం విషయంలోనే. కాబట్టి ఏ దేశంలో ఏ ఆహారం దొరుకుతుందనే అవగాహన ఉంటే బెటర్. అందుకే ఈ వివరాలు...
 
స్పెయిన్‌లో ఆలివ్ నూనె: ఈ దేశంలో 262 రకాల ఆలివ్ నూనెలు లభిస్తాయి. ఇక్కడ నుంచి 40 శాతం ఇతర దేశాలకు  ఆలివ్ నూనె ఎగుమతి అవుతుంది. ఈ దేశ ఆయిల్ ఇతర దేశాల నూనెల కన్నా మేలైనదిగా పేరుపొందినది. ఈ దేశపు వంటలలో ఆలివ్ ఆయిల్‌నే ఉపయోగిస్తారు. స్పెయిన్ లో వెల్లుల్లి, ఆలివ్ అయిల్‌ను ఉపయోగించి చేసిన రొయ్యల వంటకం రుచికరంగానూ ఆరోగ్యంగానూ ఉంటుంది.
 
జపాన్‌లో సోయ: జపాన్‌లో అల్పాహారంగా సోయానే తీసుకుంటారు. భోజనంగానూ సోయా వంటలనే ఇష్టపడతారు. రోజూ సోయా టోఫులను వంటల్లో వాడుతారు. ఇక్కడి వంటకాలు అత్యంత ఆరోగ్యప్రదాయినిగా ప్రపంచమంతా పేరుపొందాయి.అల్లం, ఎండుమిర్చి, టోఫూలతో తయారుచేసిన వంటకం జపాన్‌లో ఫేమస్.
 
గ్రీస్‌లో యోగర్ట్: గ్రీస్ దేశంలో తియ్యని యోగర్ట్(మన పెరుగులాంటిది) ను స్నాక్‌గా తీసుకుంటారు. వందల ఏళ్లుగా యోగర్ట్ వీరి ఆహారంలో భాగమైంది. ఈ దేశంలో కొత్తగా పెళ్లయిన జంటలకు యోగర్ట్, తేనె, వాల్‌నట్స్ కలిపి తినిపిస్తారు. గ్రీసు దేశపు ఉత్పత్తులలో యోగర్ట్‌ను అమెరికా అధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఉల్లికాడలు, వెల్లుల్లి, నల్లమిరియాల పొడి, పుదీనా ఆకులు, యోగర్ట్ కలిపి చేసిన వంటకం అత్యంత రుచిగా ఉంటుందని పేరుపొందినది.
 
పప్పుదినుసులు మనవే:  భారతదేశపు పప్పుదినుసులు ప్రపంచంలోని అందరూ సౌకర్యవంతమైన ఆహారంగా భావిస్తారు. పప్పు, పప్పు దినుసులను ప్రతిభోజనంలోనూ తీసుకునే వీలుంటుంది. ఎక్కువ ప్రొటీన్లు ఉండి అత్యంత తక్కువధరకు లభించే ఆహారంగా మన పప్పుదినుసులకు విదేశాలలో పేరుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement