ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే... | Travel Tips | Sakshi
Sakshi News home page

ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే...

May 5 2015 11:52 PM | Updated on Sep 3 2017 1:29 AM

ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే...

ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే...

వేసవిలో పిల్లలకోసం తప్పనిసరి ప్రయాణాలుంటాయి.

ట్రావెల్ టిప్స్
 
వేసవిలో పిల్లలకోసం తప్పనిసరి ప్రయాణాలుంటాయి. వారిలో ప్రయాణపు ఆనందాన్ని పెంచడానికి కొన్ని సూచనలు... పిల్లలు ఎప్పుడూ ఫన్ కోరుకుంటారు. బొమ్మలు వారి సరదా తీర్చినా, అది కొంతసేపే! వారి మెదళ్లకు ఎక్కువ పని ఉండేవి.. బోర్ కొట్టని ‘బ్రెయిన్ బిల్డింగ్ గేమ్స్’ వెంట తీసుకెళ్లడం మంచిది.
     
వాతావరణ మార్పులు పడక పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. వీటికి సంబంధించిన మందుల కోసం ప్రయాణానికి ముందుగానే డాక్టర్‌ని సంప్రదించి, వారి సూచన తీసుకోవాలి. పెద్దవారి మందులతో కలిపి కాకుండా జిప్పర్‌లాక్ బ్యాగ్‌లో వేసి, విడిగా పెడితే త్వరగా తీసుకొని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది.
     
కొంతమంది పిల్లలకు వాహనాల్లో ప్రయాణించడం పడదు. వాంతి చేసుకోకుండా ఉండటానికి ‘సిక్‌నెస్’ మందులను కూడా వైద్యుల సూచన మేరకు వెంట ఉంచుకోవాలి.ఆకలి వేసి పిల్లలు విసిగించకుండా ఉండాలంటే అల్పాహారం, భోజనం సరిపడినంత తినిపించాలి. బిస్కెట్లు, పాలు, జ్యూస్, పెరుగు, పండ్లు.. ఇలా పిల్లలు తినదగ్గ, ఎంపిక చేసుకున్న ఇతర పదార్థాలను హోటల్‌రూమ్‌లో సిద్ధంగా ఉంచుకోగలిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి.

వెళ్లే చోట పిల్లలు ఆనందించే విహార ప్రదేశాల గురించి ముందే తెలుసుకోవాలి. రోజులో పిల్లలు ఎక్కువ సేపు ఆడుకునే క్రీడా మైదానాలకు తీసుకెళితే, ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశాలనూ వారు బాగా ఆనందిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement