ముస్తాబు
ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు...
శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు...
మాసమేదైనా... వేడుకేదైనా...
అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే
ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది.
అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది.
నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం...
1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు.
2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్‌వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది.
4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు.
5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు.
డిజైనర్ టిప్స్:
కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్‌లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు.
ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి.
ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం.
మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి.
సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి.
బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి.
కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్
www.mugdha410@gmail.com
ఆషాఢ లక్ష్ములు...
Published Wed, Jun 25 2014 10:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement