నవంబర్ 15న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | today sania mirza birthday | Sakshi
Sakshi News home page

నవంబర్ 15న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Nov 15 2015 3:19 AM | Updated on Sep 3 2017 12:29 PM

నవంబర్ 15న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

నవంబర్ 15న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుం టున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడైన కేతుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల\....

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సానియా మీర్జా (టెన్నిస్ క్రీడాకారిణి)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుం టున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడైన కేతుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు.

అందువల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. మీ పుట్టిన తేదీ 15. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల జీవితం ఉత్సాహవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. పిల్లల పెళ్లిళ్లు తదితర బాధ్యతలు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీకన్నా పై స్థాయి వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్ వారితో నెరిపే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

లక్కీ నంబర్స్: 1,4,6,7, 9; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, క్రీమ్, వయొలెట్; సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించడం, అవివాహిత యువతుల పెళ్లి ఖర్చులు భరించడం, అనాథలకు, వికలాంగులకు సహాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement