పట్టు ఉండాలి

Today Ronald Reagan is Jayanthi - Sakshi

చెట్టు నీడ

పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే.

మనిషికి దేవుడు ఏదైనా కఠిన పరీక్ష పెట్టాడూ అంటే, అది పిల్లల విషయంలోనే అయి ఉంటుంది. ఈ ఉద్యోగాలు, లోకంతో నెగ్గుకు రావడం.. ఇవన్నీ కూడా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నాలతో పోల్చి చూస్తే చాలా చిన్నవిగా అనిపిస్తాయి. పిల్లల ఆరోగ్యం, చదువులు, వారి అభివృద్థి, భవిష్యత్తు.. ఈ ఆలోచనలతోనే మనిషి జీవితం గడిచిపోతుంది. అరిజోనాలోని ఆర్మే స్కూల్‌ నుంచి ఒక రోజు రొనాల్డ్‌ రీగన్‌కు కంప్లైంట్‌ వచ్చింది. మీ అమ్మాయి స్మోక్‌ చేస్తోందనీ, స్కూల్‌ రూల్స్‌ ఫాలో అవడం లేదనీ! అలాంటి ఫిర్యాదే పిల్లల్లో ఆఖరివాడి గురించి కూడా ఆ తర్వాత కొన్నేళ్లకు వచ్చింది. ‘మీ అబ్బాయికి ఫ్రెంచిలో  సి గ్రేడ్, ఆల్‌జీబ్రాలో డి గ్రేడు వచ్చింది. మాతో పాటు మీరు కూడా కేర్‌ తీసుకోవాలి’ అని. రీగన్‌ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. అప్పటికింకా ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. రెండు సందర్భాల్లోనూ పిల్లల్ని దగ్గర కూర్చొబెట్టుకుని మాట్లాడాడు. కానీ అతడికి అపనమ్మకం.. తన మాట వింటారా అని. అలాగే చాలాసార్లు ఆయన డైలమాలో పడేవారు. 

‘‘పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు తెలిసిన పద్ధతులు... చెయ్యిపట్టి నడిపించడం లేదా నీ దారి నువ్వు వెతుక్కొమ్మని చెయ్యి వదిలేయడం! చెయ్యిపట్టి ఎక్కడికి నడిపిస్తాం? మనం వచ్చిన దారిలో, మనకు తెలిసిన దారిలోనే కదా. ఈ ‘స్టేజ్‌ డైరెక్షన్‌’లో పిల్లలకు కనీసం ఉండవలసిన స్వేచ్ఛ ఎక్కడో జారిపోతుంది. ఇక.. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే. జారిపోయిన పిల్లల స్వేచ్ఛకు, తప్పించుకున్న పెద్దల బాధ్యతకు జీవితం ఎక్కడో ఒక చోట నిలబెట్టి మరీ మూల్యం అడుగుతుంది. నిర్లక్ష్యం, మూల్యం అన్నవి పిల్లల వయసుకు అర్థం కానివి! అర్థమయ్యేలా చెప్పకపోతే వారిని జీవితాంతం బాధపెట్టేవి!! మరెలా?’’ అని రీగన్‌ తన భార్యతో దీర్ఘ సంభాషణ చేసేవారు. ఆయన భార్య నాన్సీ మాత్రం.. పిల్లల్ని పట్టుకునే నడిపించాలి అనేవారు. ఆమె మాటే నిజం అనిపిస్తుంటుంది.
(నేడు రొనాల్డ్‌ రీగన్‌ జయంతి) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top