హిట్లర్ కన్ను పడింది! | Today Indian Armed Forces Day flag | Sakshi
Sakshi News home page

హిట్లర్ కన్ను పడింది!

Dec 7 2015 12:07 AM | Updated on Sep 3 2017 1:36 PM

హిట్లర్ కన్ను పడింది!

హిట్లర్ కన్ను పడింది!

భారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో...

మన ఘనత
భారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో 1949 నుండి ఏటా డిసెంబర్ 7న మనం ‘ఫ్లాగ్ డే’ జరుపుకుంటున్నాం. త్రివిధ దళాల సైనికుల గౌరవార్థం నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మన ఆర్మీ గురించి 5 విశేషాలు! హిట్లర్‌కు ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం.

ఒక సందర్భంలో ఆయన మన ‘గూర్ఖా’ దళం సహాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట. గూర్ఖా సైనికులు తన దగ్గర ఉంటే మొత్తం ఐరోపా ఖండాన్నే తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవచ్చని ఆయన తలపోశారట! జర్మనీ సైనికులకు దీటైన శక్తి ప్రపంచంలో గూర్ఖా దళం ఒక్కటే అని హిట్లర్ అన్నట్లు  చరిత్రకారులు చెబుతారు. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సైనిక దళం భారత్‌కే ఉంది.
 
ఖండాంతర క్షిపణి అగ్ని-5 ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడం ద్వారా భారత్... యు.ఎస్. ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలోని యుద్ధక్షేత్రం భారత్ నియంత్రణలో ఉంది. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో మన సైనికులు గస్తీ కాస్తున్నారు.
 
అతిపెద్ద వలంటీర్ ఆర్మీ.. ప్రపంచంలో ఒక్క భారత్‌కే ఉంది. నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన వారిని వలంటీర్ ఆర్మీ అంటారు.
 (నేడు భారతీయ సైనిక దళాల పతాక దినోత్సవం)

Advertisement
 
Advertisement
Advertisement