స్మార్ట్ షాపింగ్ | Tips to Smart Shopping | Sakshi
Sakshi News home page

స్మార్ట్ షాపింగ్

Dec 5 2013 12:30 AM | Updated on Sep 2 2017 1:15 AM

స్మార్ట్ షాపింగ్

స్మార్ట్ షాపింగ్

కొంతమంది సందర్భానుసారం, ఇంకొంతమంది ఇష్టానుసారం షాపింగ్ చేస్తుంటారు. అవసరం ఉన్నదీ లేనిదీ కొనేసి, డబ్బు అధికంగా ఖర్చు చేసి, ఆ తర్వాత చింతించేవారూ ఉంటారు.

కొంతమంది సందర్భానుసారం, ఇంకొంతమంది ఇష్టానుసారం షాపింగ్ చేస్తుంటారు.  అవసరం ఉన్నదీ లేనిదీ కొనేసి, డబ్బు అధికంగా ఖర్చు చేసి, ఆ తర్వాత చింతించేవారూ ఉంటారు. షాపింగ్ అంటే మీకు అమితమైన ఇష్టం ఉండి, ఆ తర్వాత అనవసరమైనవి కొన్నాను అని చింతించేవారి లిస్టులో మీరూ ఉంటే మీకోసమే ఈ స్మార్ట్ షాపింగ్ పొదుపు పద్ధతులు...
     
 షాపింగ్‌కి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
     
 మీరు కొనుగోలు చే సే డ్రెస్ ఫ్యాబ్రిక్ సౌకర్యవంతంగా ఉందా? ఎన్ని సార్లు ఉపయోగించుకోవచ్చు? ఆ డ్రెస్‌కు ఉన్న ప్రత్యేకతలు ఏంటి? వీటన్నింటికీ మీ దగ్గర సంతృప్తికరమైన సమాధానం ఉంటేనే కొనుగోలు చేయండి.
     
 కొనుగోలు చేసేముందు బ్రాండెడ్ దుస్తుల మీదే ఎక్కువ ఖర్చుపెట్టడం మంచిదేనా ఆలోచంచండి. టాప్స్ విడిగా, బాటమ్స్ విడిగా తీసుకొని రకరకాల కాంబినేషన్స్‌తో దుస్తులను షాపింగ్ చేస్తే డబ్బుకు డబ్బు ఆదా. మల్టీకలర్ డ్రెస్సులు ధరించామన్న సంతోషమూ ఉంటుంది.
     
 ప్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. డిజైన్‌వేర్ చాలా వరకు రిపీట్ అవుతుంటుంది. అదే క్లాసిక్ ప్యాటర్న్స్ ట్రెండ్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకని క్లాసిక్ ప్యాటర్న్, డిజైన్స్ ఉన్న దుస్తులను ఎంపిక చేసుకోండి.
 
 మీ బడ్జెట్‌లో షాపింగ్ కోసం కొంత డబ్బును కేటాయించి, అంతలోనే కొనుగోలు ఉండాలనే నిబంధనను పెట్టుకోండి.
     
 ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చేయడం సరికాదు. మైండ్ కూడా చురుకుగా పనిచేయదు. ఫలితంగా ఏదో ఒకటిలే అనుకునే అవకాశం ఉంది. అందుకని భోజనం చేసిన తర్వాత షాపింగ్ పనులు పెట్టుకోవడం మేలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement