ఒత్తిడిని జయించండిలా..! | this is the process to over come from stress | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని జయించండిలా..!

Jan 29 2014 12:13 AM | Updated on Sep 2 2017 3:06 AM

ఒత్తిడిని జయించండిలా..!

ఒత్తిడిని జయించండిలా..!

అనేక భారాలు, ఒత్తిడులతో... జీతానికి, జీవితానికి మధ్య అనుక్షణం నలిగిపోతున్నాడు మగాడు. ఉరుకుల పరుగుల జీవితంలో వయోభేదాలు, స్థాయీభేదాలు లేకుండా మగాడిని ‘స్ట్రెస్’ ముప్పుతిప్పలు పెడుతోంది.

 అనేక భారాలు, ఒత్తిడులతో... జీతానికి, జీవితానికి మధ్య అనుక్షణం నలిగిపోతున్నాడు మగాడు. ఉరుకుల పరుగుల జీవితంలో వయోభేదాలు, స్థాయీభేదాలు లేకుండా మగాడిని ‘స్ట్రెస్’ ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే ఇది మరీ వదిలించుకోలేని గడ్డు సమస్యేమీ కాదు. ఈ చిట్కాలు పాటిస్తే చాలు... ఒత్తిడిని చిత్తు చేయవచ్చు.
 
  విరామం తీసుకోండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి నంబర్‌వన్ మందు... స్వచ్ఛమైన గాలి. లాంగ్ డ్రైవ్, బీచ్‌లో గడిపే ఒక సాయంత్రం స్ట్రెస్‌ను తగ్గించడంలో మ్యాజిక్‌లా పనిచేస్తాయి. కాబట్టి చాన్స్ దొరికితే డ్రైవ్‌కి చెక్కేయండి. చల్లటి పైరగాలిని పీల్చండి. రిలీఫ్ రాకపోతే అడగండి!
 
  పక్కాగా ప్లాన్ చేసుకోండి: తమ పనుల విషయంలో కచ్చితమైన ప్రణాళికతో ఉండేవారికి సగం భారం తగ్గినట్టే. భారమే లేనప్పుడు ఒత్తిడి ఎందుకొస్తుంది!
 
   నో చెప్పడం నేర్చుకోండి: అతిగా ఆతృతపడటం వల్ల ఏర్పడినంత స్ట్రెస్ మరి దేనివల్లా రాదు. అవతలి వారిని మెప్పించడానికి, పై వారిని ఆకట్టుకోవడానికి మీ స్థాయికి మించిన భారాలను తలకెత్తుకోకండి. మీ వల్ల కాదు అనుకున్న సందర్భాల్లో ‘నో’ అని చెప్పడానికి మొహమాటపడకండి.
 
  జిమ్‌కెళ్లండి: జిమ్ అనగానే బాడీ బిల్డింగ్ కోసమనుకుంటారు చాలామంది. కానే కాదు. వ్యాయామంతో స్వేదం చిందించడం ఒత్తిడిని తగ్గించుకోవడానికో ఉత్తమ మార్గం. మాంచి మ్యూజిక్ వింటూ కసరత్తు చేస్తే ఇక తిరుగే ఉండదు!
 
  వీటిని మార్చాలి: అలసిపోయామని టీ తాగేస్తాం. కాఫీ పట్టించేస్తాం. కూల్‌డ్రింకులతో చల్లబడదామనుకుంటాం. కానీ ఇవన్నీ ఒత్తిడిని పెంచేవేనని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా కెఫీన్ ఎక్కువ ఉండేవాటికి దూరంగా ఉండటం ఉత్తమం!
 
  హాబీలుంటే మేలు: ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక క్రియేటివ్ హాబీ ఉంటే చాలు... మానసికాందోళన ఇట్టే పారిపోతుంది. కాబట్టి మీ మనసుకు నచ్చిన ఏదైనా సృజనాత్మక హాబీని అలవర్చుకోండి!
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement