కొవ్వు పదార్థాలంటే ఎప్పుడూ చెడు చేసేవేనా? 

There is misconception that fat content is bad - Sakshi

విటమిన్స్‌టే చెడు చేస్తాయనే అపోహ చాలామందికి ఉంది. కొన్ని విటమిన్లు, అన్ని పోషకాలూ సమకూరాలంటే కొవ్వులు కావాల్సిందే! అవే ఏ, డి, ఈ, కే విటమిన్లు. అవి ఫ్యాట్‌ సొల్యుబుల్‌ విటమిన్స్‌. శరీరం బరువు తగ్గడానికి కూడా కొన్ని కొవ్వులు కావాలి. కాకపోతే కొవ్వుల్లో కొన్ని రకాలైన ట్రాన్స్‌ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్‌ ఫ్యాట్స్‌ని మాత్రం తగ్గించాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6, ఒమెగా 9 ఫ్యాటీ ఆసిడ్స్‌ వంటి కొవ్వులు మేలు చేస్తాయి.

ఈ తరహా కొవ్వు పదార్థాలు చేపల్లో, అవిశె నూనెలో ఉంటాయి. కొవ్వు పదార్థాలన్నీ చెడ్డవే అనుకునే చాలా మంది వాటిని తీసుకోవడం తగ్గిస్తారు. అలా అవసరమైనన్ని కొవ్వులు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించండి. అందుకే పూర్తిగా నిరాకరించకండి. అలాగని అధికంగా తీసుకోకండి. మితమెప్పుడూ హితమే.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top