నిలవనివ్వదు... నడవనివ్వదు... | The sick man of rare, | Sakshi
Sakshi News home page

నిలవనివ్వదు... నడవనివ్వదు...

Jan 30 2016 12:37 AM | Updated on Sep 3 2017 4:34 PM

నిలవనివ్వదు...  నడవనివ్వదు...

నిలవనివ్వదు... నడవనివ్వదు...

అరుదుగా వచ్చే ఈ జబ్బు మనిషిని స్థిరంగా నిలవనివ్వదు...

మెడిక్షనరీ

అరుదుగా వచ్చే ఈ జబ్బు మనిషిని స్థిరంగా నిలవనివ్వదు... సరిగా నడవనివ్వదు. ‘అటాక్సియా’ అని పిలిచే ఈ జబ్బు మెదడులో తలెత్తే లోపాల కారణంగా వస్తుంది. ఈ జబ్బు మొదలైతే రోగులు స్థిరంగా నిల్చోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నడిచేటప్పుడు ఆచి తూచి బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది.

ఈ జబ్బు సోకిన వారిలో ఆటోమేటిక్‌గా పనిచేసే కండరాలు సమన్వయం కోల్పోతాయి. కొందరికి ఈ జబ్బు జన్యుపరంగా వస్తుంది. ఇంకొందరిలో స్ట్రోక్ వచ్చిన తర్వాత లేదా మెదడుకు గాయమైనప్పుడు వస్తుంది. ఇతర వ్యాధుల కారణంగా మెదడు దెబ్బతిన్నప్పుడు కూడా వస్తుంది.
 
  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement