
మెదడు తినేస్తుంది!
ఈ జబ్బు ఉన్నవారు అత్యంత నాణ్యమైనదీ, ఖరీదైనదీ, అద్భుతమైన హంగులు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు.
ఈ జబ్బు ఉన్నవారు అత్యంత నాణ్యమైనదీ, ఖరీదైనదీ, అద్భుతమైన హంగులు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. సాధారణంగా తలలోని ముందుభాగంలో ఉండే మెదడు (ఫ్రంటల్‌లోబ్) దెబ్బతిన్న తర్వాత వాళ్లలో తిండియావ మొదలవుతుంది. ఇక దాంతో ఖరీదైన ఆ తిండిని తీవ్రమైనయావతో బకాసురుల్లా తినేస్తుంటారు.
ఈ జబ్బును ‘గౌర్‌మాండ్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. ఇలాంటి ఖరీదైన ఆహారాన్ని తినాలనే ఈ విచిత్ర పరిస్థితి ప్రాణాపాయానికి దారితీయదు. నిరపాయకరమైన ఈ ఆహారపు అలవాటు మాత్రం పర్సుకు గండికొడుతుంది. జేబుకు చిల్లుపెడుతుంది.
మెడిక్షనరీ