గ్లూకోసమైన్‌తో గుండెకు మేలు...

Story image for britan British Medical Journal scientists from CTV News Tiny patch that could cure heart failure ready for human trials - Sakshi

కీళ్లనొప్పులను తట్టుకునేందుకు వాడే గ్లూకోసమైన్‌ గుండెకూ మేలు చేస్తుందని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ (బీఎంజే) శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని దాదాపు 4.66 లక్షల మందిపై అధ్యయనం చేయడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు బీఎంజేలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలిపింది. గుండెజబ్బులేవీ లేని.. 40 – 69 మధ్య వయస్కులపై తమ అధ్యయనం జరిగిందని... వీరందరి ఆరోగ్య.. ఆరోగ్య పరిరక్షణకు వారు తీసుకుంటున్న పదార్థాల వివరాలన్నింటినీ తీసుకున్న తరువాత ఏడేళ్లపాటు వీరి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ అధ్యయనం సాగిందని శాస్త్రవేత్త ‘లుకీ’ తెలిపారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 90 వేల మంది గ్లూకోసమైన్‌ను క్రమం తప్పకుండా తీసుకునే వారు ఉన్నారని కీ తెలిపారు. గ్లూకోసమైన్‌ తీసుకోని వారితో పోలిస్తే తీసుకునే వారికి గుండెజబ్బు వచ్చేందుకు దాదాపు 18 శాతం తక్కువ అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనం చెబుతోందని కీ చెప్పారు. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువని అన్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ధూమపానం, గతంలో ఉన్న వ్యాధులు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తాము ఈ లెక్కలు వేశామని చెప్పారు. మరింత విస్తృతమైన పరిశోధన చేసి.. ఫలితాలను నిర్ధారించుకుంటే.. గ్లూకోసమైన్‌ను గుండెజబ్బుల నివారణకూ వాడేందుకు అవకాశం ఏర్పడుతుందని కీ వివరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top