ధైర్యమున్న పిల్లే! | special story to Photographer Sharvee Chaturvedi | Sakshi
Sakshi News home page

ధైర్యమున్న పిల్లే!

Mar 28 2018 12:09 AM | Updated on Mar 28 2018 12:09 AM

special story to Photographer Sharvee Chaturvedi - Sakshi

శర్వీ చతుర్వేది

కింగ్‌ ఫిషర్స్‌ క్యాలెండర్‌ గురించి మీరు వినే ఉంటారు. చాలా ఫేమస్‌.అందులో లేడీ మోడల్స్‌ ఉంటారు. అయితే ఇందులో మేల్‌ మోడల్స్‌ఉంటారు. అందుకే దీన్ని క్వీన్‌ ఫిషర్స్‌ క్యాలెండర్‌ అనొచ్చు. విశేషం 
ఏంటంటే.. ఈ మేల్‌ క్యాలెండర్‌ కోసం బాలీవుడ్‌ బాయ్స్‌ని షూట్‌ చేసింది... ఓ లేడీ ఫొటోగ్రాఫర్‌. ధైర్యమున్న పిల్లే! 

మహిళా మోడళ్లతో ఏ దివిలోనో ఫొటో సెషన్‌ పెట్టి, ఏటా అందమైన క్యాలెండర్‌ రిలీజ్‌ చేసి, ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది ‘కింగ్‌ ఫిషర్స్‌’ సంస్థ. అయితే ఆ క్రెడిట్‌ అంతా ఫొటోగ్రాఫర్‌ అతుల్‌ కాస్బేకర్‌ది. అలా స్త్రీ సౌందర్య రాశులను మగ ఛాయాచిత్ర గ్రాహకులు అందాల చట్రంలో బంధించడం అన్నది ఓ సంప్రదాయం అయింది. అయితే ఇప్పుడా సంప్రదాయాన్ని బద్దలు కొట్టేశారు లేడీ ఫొటోగ్రాఫర్‌ శర్వీ చతుర్వేది. 

ఎలా సాధ్యం అయింది?
శర్వీ 2015లో తొలిసారిగా.. కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ చిన్నబుచ్చుకునేలా.. ఆల్‌ మేల్‌ మోడల్స్‌తో ఫొటో షూట్‌ చేశారు. మేల్‌ మోడల్స్‌గా పోజ్‌ ఇచ్చిన వాళ్లంతా బాలీవుడ్‌ యంగ్‌ చాప్స్‌.  ‘‘లైఫ్‌ ఇన్‌ ఏ డాట్‌ సిరీస్‌’’ అనే పేరుతో ఆ షూట్‌ను నిర్వహించారు శర్వీ. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌.. స్విమ్‌ సూట్‌లో అమ్మాయిలను షూట్‌ చేసినట్టే శర్వీ కూడా  పన్నెండు మంది బాలీవుడ్‌ అబ్బాయిలను స్విమ్‌సూట్‌లో షూట్‌ చేశారు. ఇలాంటి షూట్‌ చేసిన ఫిమేల్‌ ఫొటోగ్రాఫర్స్‌ చాలా చాలా అరుదు. వాళ్లలో శర్వీ ఒకరు. ‘‘చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కాని ఇది ఫోటోగ్రాఫర్‌ ఈస్థటిక్స్‌కు సంబంధించింది. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి, ఆవిష్కరించడానికి పరిణతి ఉండాలి. కళాత్మకతతో పాటు గ్లామరస్‌ ఫార్మెట్‌ కూడా అవసరం’’ అంటారు శర్వీ. ఇక్కడ జెండర్‌ ప్రాధాన్యం కాదు అని కూడా అంటారు శర్వీ.‘‘ స్విమ్‌సూట్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఫొటోగ్రాఫర్‌కు ఇమేజ్‌ ముఖ్య భూమిక పోషిస్తుంది.

అమ్మాయిలతో ఫొటో షూట్‌ అంటే వందరకాల ప్రయోగాలకు ఆస్కారం ఉంటుంది. అదే అబ్బాయిలతో అంతగా ఉండదు.  చాలెంజింగ్‌ తీసుకోవాలి. స్టీరియోటైప్‌ను బ్రేక్‌ను చేయాలి. మోడల్స్‌తో కంటే యాక్టర్స్‌తో షూట్‌ తేలిక అనుకుంటున్నా. ఎందుకంటే క్యాలెండర్‌కు ఓ థీమ్‌ ఉంటుంది. ఆ థీమ్‌ ప్రకారమే ఫొటో ఇమేజెస్‌ను ప్రొజెక్ట్‌ చేయాలి. అంటే ఒకరకంగా వాళ్లతో యాక్ట్‌ చేయించడమన్నట్టే కదా. యాక్టర్స్‌ అయితే కాన్సెప్ట్‌ను త్వరగా అర్థం చేసుకుంటారు. కావల్సిన హావభావాలు పలికిస్తారు. అందుకే మెడల్స్‌ కన్నా యాక్టర్స్‌తోనే ఫోటో షూట్‌ ఈజీ అనుకుంటున్నా’’ అని అంటారు శర్వీ. ఈ ఫొటో షూట్‌ కోసం దబ్బూ రత్నాని, సుభాష్‌ ఘై లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు శర్వీ.  ‘‘దబ్బూ సర్‌.. అబ్జర్వేషన్‌ స్కిల్స్‌ను ఎలా పెంపొందించుకోవాలో, సహనంగా ఎలా ఉండాలో నేర్పారు. ఇక సుభాష్‌ ఘై సర్‌.. ‘‘గ్రహించాలి.. వినాలి.. చదవాలి’’ అనే మూడు ప్రిన్సిపల్స్‌ పాటిస్తారు. తనతో పనిచేసేవాళ్లు అవి పాటించేలా చూస్తారు. ‘‘జీవితంలో నువ్వు నిత్య విద్యార్థివే’’ అని చెప్తుంటారు’’ అని వాళ్లతో పనిచేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శర్వీ చతుర్వేది. 

లైఫ్‌ ఇన్‌ ఏ డాట్‌ అంటే? 
డాట్‌ అంటే శర్వీ భావనలో ఒక వృత్తం. జీవితమనే పరిపూర్ణమైన వృత్తం. జీవితంలోని ప్రతి పని ఆ వృత్తాన్ని పెంచుతూ ఉంటుంది. దీనికి  లైఫ్‌ ఇన్‌ ఏ డాట్‌ అనే లోగోలో పెద్ద ఎర్ర కుర్చీని సంకేతంగా చూపించారు శర్వీ. ఇలా డిఫరెంట్‌ ఫొటో షూట్‌ను కంటిన్యూ చేయడం ఇష్టమేనని, చాలెంజెస్‌ను స్వీకరించడం తన నైజమని అంటున్నారు శర్వీ చతుర్వేది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement