చలికి మిరియాల సెగ పెడదాం

Special Dishes For Peppermint - Sakshi

శ్రీ ముఖపుస్తకం గారి వంటలు రుచి చూద్దామా!
కావలసినవి: నల్ల మిరియాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 1 టేబుల్‌ స్పూను; అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – పావు టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీస్పూను; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ:
►ముందుగా మిక్సీలో నల్ల మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో ముప్పావు లీటరు నీళ్లుపోసి మరిగించాక, తయారు చేసి ఉంచుకున్న పొడిని మరుగుతున్న నీళ్లలో వేయాలి
►పసుపు జత చేయాలి
►చింతపండు రసం పోసి కలియబెట్టాలి
►తగినంత ఉప్పు, బెల్లం తరుగు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి మరిగించాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలిపి, మరుగుతున్న మిరియాల చారులో వేసి కలపాలి
►చివరగా కొత్తిమీరతో అలంకరించాలి
►వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.
shettyskitchen             

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top