స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..! | soul talk with smartphones ..! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..!

Aug 8 2013 11:59 PM | Updated on Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..! - Sakshi

స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..!

మీకు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో రొటీన్ అప్లికేషన్‌లతో బోర్ కొట్టిందా? గేమ్స్, చాటింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి అప్లికేషన్‌లతో విసుగనిపిస్తుంటే.. కొంచెం వెరైటీగా ట్రై చేయడానికి అవకాశమిస్తున్నారు

మీకు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో రొటీన్ అప్లికేషన్‌లతో బోర్ కొట్టిందా? గేమ్స్, చాటింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి అప్లికేషన్‌లతో విసుగనిపిస్తుంటే.. కొంచెం వెరైటీగా ట్రై చేయడానికి అవకాశమిస్తున్నారు ఇండియానాకు చెందిన దెయ్యాల పరిశోధకులు. భార్యాభర్తలైన రోజర్, జిల్లీలకు దెయ్యాలతో మంచి సంబంధ బాంధ్యవ్యాలున్నాయి.
 
ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని కూడా వారు దెయ్యాల స్టాండర్డ్‌కు తగ్గట్టుగా తీర్చారు. దెయ్యాలతో కమ్యూనికేట్ చేయడానికి తగ్గట్టుగా తాము స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించామని ప్రకటించారు ఈ దంపతులు. ఇక ఎలక్ట్రానిక్ డివైజ్ ల ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ కావచ్చనే వాదన కూడా చాలా పాతదే! పోలరాయిడ్ కెమెరాల తో దెయ్యాలను ఉనికిని గుర్తించవచ్చు... అనే థియరీలు ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement