కట్టు మారిన పట్టు

Silk Saris Sre Purchased During The Ceremony - Sakshi

ఫ్యాషన్‌

పట్టు చీరలు వేడుకల సందర్భంలోనే కొనుగోలు చేస్తారు. అలాగే వాటిని సంప్రదాయ వేడుకలకే ధరిస్తారు. సంప్రదాయ వేడుకలతో పాటు గెట్‌ టు గెదర్, రిసెప్షన్‌ వంటి ఇండోవెస్ట్రన్‌ పార్టీలకు కూడా ఇలా రెడీ అవచ్చు. ఇప్పుడు చలికాలం కూడా కాబట్టి సీజన్‌కి తగ్గట్టు చీరకట్టులో మార్పులు చేసుకోవచ్చు.

►బ్లూ బెనారస్‌ పట్టు చీరకి సిల్వర్‌ జరీతో ఉండే స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను జత చేశారు. బ్లౌజ్, మెడలో సిల్వర్‌ హారం, హెయిర్‌ స్టైల్‌.. ఈ చీర కట్టు లుక్‌ని పూర్తిగా మార్చేసింది.

►ఆకుపచ్చ అంచు ఉన్న గులాబీ రంగు కంచి పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ ఎంపిక చేసుకోవాలి. అది కూడా పెప్లమ్‌ బ్లౌజ్‌ అయితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ చీరకు వంగపండు రంగు పెప్లమ్‌ బ్లౌజ్‌ను వాడారు. లైట్‌ మేకప్, హెయిర్‌ను వదిలేస్తే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతరత్రా ఆభరణాలు ధరించనవసరం లేదు. ఈ స్టైల్‌ ఏ పార్టీకైనా, వేడుకకైనా బాగుంటుంది.

►ఇది బ్లాక్‌ కలర్‌ బెనారస్‌ పట్టు చీర. దీనికి సెల్ఫ్‌కలర్‌ హా‹ఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ని వాడారు. అలాగే కాంట్రాస్ట్‌ టైని మెడకు అలంకరించారు. దీంతో పట్టు చీర లుక్‌ పూర్తి స్టైలిష్‌గా మారింది.

►ఆరెంజ్‌ కలర్‌ పట్టుచీరకు కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ వాడుకోవచ్చు. వెస్ట్రన్‌ స్కర్ట్‌మీదకు వాడే టాప్‌ వేసుకుంటే ప్రెట్టీగా కనిపిస్తారు. దీని మీదకు పిస్తా షేడ్‌ గ్రీన్‌ జాకెట్‌ను వేసుకుంటే లుక్‌ పూర్తిగా స్టైలిష్‌గా మారిపోతుంది. కాక్‌టెయిల్‌ పార్టీస్‌కు కూడా నప్పే డ్రెస్‌ అవుతుంది.

►ప్లెయిన్‌ పట్టు చీరకి పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌లో సైడ్‌ కట్స్‌ ఉన్న ఎల్లో లాంగ్‌ జాకెట్‌ను వాడారు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ను ఉపయోగించారు. ఫిష్‌ టెయిల్, సైడ్‌ జడ వేసుకుంటే చాలు మేకోవర్‌ పూర్తయినట్టే.

►ఇది బ్రైట్‌ రెడ్‌ శారీ. సహజంగా పెళ్లి కూతురు డ్రెస్‌గా వాడుతారు. దీనిని ఇండోవెస్ట్రన్‌ పార్టీలకూ ధరించాలంటే ఇలా జరీ కలర్‌లో జాకెట్‌ని ధరించాలి. పల్లూని ముందువైపుగా తీసుకొని, కుచ్చిళ్ల పార్ట్‌ని లెహంగా స్టైల్‌లో అమర్చుకోవాలి. ఈ లెహంగా శారీ విత్‌ జాకెట్‌ స్టైల్‌ డ్రేప్‌ ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top