
షాకులే నయమనుకుంటారట!
ఒంటరితనంతో విసిగి వేసారిపోయిన ఏకాకులు ఒంటరిగా ఉండే కంటే విద్యుత్‌షాకులు
పరిపరి శోధన
ఒంటరితనంతో విసిగి వేసారిపోయిన ఏకాకులు ఒంటరిగా ఉండే కంటే విద్యుత్‌షాకులు తినడమే నయమనుకుంటారట! వర్జీనియా వర్సిటీ పరిశోధకులు ఈ మహత్తర విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ప్రయోగానికి సిద్ధపడ్డ పద్దెనిమిది మంది ఏకాకులను వేర్వేరు గదుల్లో పనీపాటా లేకుండా ఉంచారు. ఆ గదుల్లో ఎవరికి వారే షాకిచ్చుకునే సౌలభ్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
స్వచ్ఛందంగా ఈ గదుల్లోకి చేరిన పద్దెనిమిది మందిలో పన్నెండు మంది ఒంటరితనాన్ని భరించలేక తమకు తామే షాకులిచ్చుకున్నారు. ఈ ప్రయోగం ఆధారంగా ఏకాకులు షాకులు కోరుకుంటారని వర్జీనియా పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు.